ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో సంద‌డి చేసిన‌ ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, క‌న్న‌డ‌, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 19న ఉగాది పండుగ కానుకగా థియేటర్లలో విడుదలైంది. విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ప్ర‌ముఖ‌ దర్శకుడు హరీశ్‌ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ustaad Bhagat Singh
Pawan Kalyan
Netflix
Sreeleela
Harish Shankar
Telugu Movie
OTT Streaming
Devi Sri Prasad
Tollywood
Movie Release Date

More Telugu News