కొత్త అవతారంలో విజయసాయిరెడ్డి.. మీడియా రంగంలోకి ఎంట్రీ!

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలోనే మీడియా రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన ప్రణాళికలను వివరిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కీలక విషయాలు పంచుకున్నారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని, జర్నలిజం ద్వారా ప్రజలకు సేవ చేస్తానని ఆయన పేర్కొన్నారు.

మొదటగా తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఒక డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ డిజిటల్ వేదిక విజయవంతమైన తర్వాత అదే విలువలు, లక్ష్యాలతో తెలుగులో ఒక శాటిలైట్ న్యూస్ ఛానెల్‌ను కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. తాము స్థాపించబోయే మీడియా సంస్థ పూర్తిగా నిష్పక్షపాతంగా, వాస్తవాలకు కట్టుబడి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

"మా మీడియా సంస్థ ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండదు. ఇది పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తుంది. సామాన్యులు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, అణగారిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం. వారి గొంతుకను వినిపిస్తాం" అని విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తమ మీడియా సంస్థ పేరును త్వరలోనే ప్రకటిస్తానని ఆయన తెలిపారు.

Vijayasai Reddy
Vijayasai Reddy media
Telugu news
Digital news platform
Satellite news channel
Journalism
Telugu journalism
Andhra Pradesh news
Political news Andhra Pradesh
Independent media

More Telugu News