టాలీవుడ్‌లో కలకలం.. నిర్మాత సునీల్ నారంగ్‌కు టోకరా.. కోటికి పైగా కొట్టేసిన అకౌంటెంట్

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కార్యాలయంలో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న అకౌంటెంటే ఏకంగా కోటి రూపాయలకు పైగా కాజేసిన ఘటన టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే... జూబ్లీహిల్స్‌లోని సునీల్ నారంగ్ కార్యాలయంలో వనస్థలిపురానికి చెందిన విశ్వనాథ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. వారాంతపు చెల్లింపులు, డిస్ట్రిబ్యూటర్ల చెక్కుల వ్యవహారాలను అతడే పర్యవేక్షించేవాడు. ఇదే అదనుగా కొన్ని బోగస్ బ్యాంకు ఖాతాలను సృష్టించాడు. అసలైన చెక్కుల మధ్యలో ఈ ఫేక్ అకౌంట్ల చెక్కులను కూడా ఉంచి, యజమాని సునీల్ నారంగ్‌తో చాకచక్యంగా సంతకాలు చేయించుకునేవాడు.

గత మూడేళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా ఈ మోసానికి పాల్పడుతూ, దాదాపు కోటి రూపాయలను తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. అయితే, 2024 వార్షిక ఆడిటింగ్ సమయంలో లెక్కల్లో తేడాలు కనిపించడంతో ఈ బాగోతం బయటపడింది. వెంటనే సునీల్ నారంగ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న విశ్వనాథ్‌ను ఎట్టకేలకు పట్టుకుని, విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు.



Suniel Narang
Asian Cinemas
Telugu film producer
financial fraud
accountant fraud
Jubilee Hills police
Vishwanath
Tollywood news
fraud case
annual auditing

More Telugu News