మీర్జాపూర్‌లో దారుణం.. మార్నింగ్ వాక్‌లో లాయర్ దారుణ హత్య.. వీడియో ఇదిగో!

ఉత్తరప్రదేశ్‌లో దుండగులు మరోసారి బరితెగించారు. మీర్జాపూర్ జిల్లాలో శనివారం ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ సీనియర్ న్యాయవాదిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కత్రా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సీనియర్ న్యాయవాది రాజీవ్ సింగ్ రోజూలాగే ఈ ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. ఆయన నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు.

తప్పించుకునేందుకు రాజీవ్ సింగ్ కొంత దూరం పరుగెత్తినప్పటికీ, దుండగులు వదలకుండా వెంటాడి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో బుల్లెట్ల వర్షం కురిపించారు. తీవ్ర రక్తస్రావంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. జనసంచారం ఉన్న ప్రాంతంలోనే ఈ హత్య జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై మీర్జాపూర్ బార్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.

Rajeev Singh
Mirzapur
Uttar Pradesh
lawyer murder
advocate killed
morning walk
crime news
bar association
police investigation
CCTV footage

More Telugu News