‘పెద్ది’పై క్రేజీ అప్‌డేట్.. ఫుల్ స్వింగ్‌లో పనులు!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్‌డేట్‌ను సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు పంచుకున్నారు. సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రస్తుతం కలర్ గ్రేడింగ్ పనులు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ రత్నవేలు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. "పెద్ది కలర్ గ్రేడింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి" అని పోస్ట్ చేశారు. గతంలో కూడా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల గురించి మాట్లాడుతూ.. "పగలు షూట్ చేయడం, రాత్రిపూట గ్రేడింగ్ చేయడం. తీరికలేని రోజులు, నిద్రలేని రాత్రులు.. ఇదంతా పెద్ద స్క్రీన్ కోసమే" అంటూ సినిమాపై తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు.

ఇదిలా ఉంటే... ఇటీవ‌లే రామ్ చరణ్ స్వయంగా సినిమా షూటింగ్ పై స్పష్టతనిచ్చారు. ‘పెద్ది’ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని, కేవలం ఒకే ఒక్క పాట చిత్రీకరణ మిగిలి ఉందని ఆయన వెల్లడించారు. ‘రాక్షస’ చిత్ర బృందం ‘పెద్ది’ సెట్స్‌ను సందర్శించినప్పుడు చరణ్ ఈ వివరాలు పంచుకున్నారు.

ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'పెద్ది పెహెల్వాన్ గ్లింప్స్' సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. గతంలో విడుదలైన ఓ వీడియోలో చరణ్ క్రికెట్ బ్యాట్‌తో కనిపించగా, ఈ గ్లింప్స్‌లో మాత్రం పహెల్వాన్‌గా పూర్తి భిన్నమైన, పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. "కుస్తీ అనేది బ్యాట్ పట్టుకుని బంతిని ఎదుర్కొనే ఆట కాదు.. ప్రాణాలను పణంగా పెట్టి చావును ఎదిరించే ఆట" అనే డైలాగ్‌తో మొదలైన ఈ గ్లింప్స్‌లో కఠినమైన సాధన చేస్తూ, దృఢమైన శరీరంతో చరణ్ కనిపించారు. 

భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 



Peddi
Buchi Babu Sana
Ram Charan
Janhvi Kapoor
Rathnavelu
Telugu movie
Indian cinema
Color grading
Pehlwan glimpse
Shiva Rajkumar

More Telugu News