మూడేళ్ల తర్వాత క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లీ... రవి బిష్ణోయ్ అరుదైన ఘనత

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఓ అరుదైన రీతిలో ఔటయ్యాడు. దాదాపు మూడేళ్లుగా ఏ బౌలర్‌కూ సాధ్యం కాని ఘనతను రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సాధించాడు. గువాహ‌టిలో నిన్న‌ జరిగిన మ్యాచ్‌లో కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు.

ఈ మ్యాచ్‌లో 16 బంతుల్లో 32 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న కోహ్లీని రవి బిష్ణోయ్ తన గూగ్లీతో బోల్తా కొట్టించాడు. బిష్ణోయ్ వేసిన బంతిని అంచనా వేయడంలో విరాట్ విఫలమయ్యాడు. దీంతో బంతి అతని బ్యాట్, ప్యాడ్ మధ్యలో నుంచి దూసుకెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. ఈ ఊహించని బంతికి కోహ్లీ నిశ్చేష్టుడైపోయాడు.

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ బౌల్డ్ కావడం 1,089 రోజుల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారిగా 2023లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా అతడిని ఈ రీతిలో ఔట్ చేయలేకపోయాడు. తాజాగా రవి బిష్ణోయ్ ఈ అరుదైన రికార్డుకు తెరదించి, తన జట్టుకు కీలక వికెట్ అందించాడు.



Virat Kohli
RCB
Ravi Bishnoi
IPL 2024
Royal Challengers Bangalore
Rajasthan Royals
Cricket
Bishnoi Googly
Kohli Wicket
Akash Singh

More Telugu News