నా ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండాలి: 'రాకాస' సక్సెస్ ఈవెంట్ లో నిహారిక కొణిదెల

మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘రాకాస’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సల్‌తో కలిసి ఆమె నిర్మించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర డిస్ట్రిబ్యూటర్లు ‘బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్’ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు బ్రహ్మాజీ, ప్రముఖ నిర్మాత మైత్రీ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘రాకాస సినిమాను ఆదరించిన ప్రతీ ఒక్క ప్రేక్ష‌కుడికి వ్యక్తిగతంగా థాంక్స్ చెప్పాలని ఉంది. కానీ అది సాధ్యం కాదు. మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారంటే, అదే నాకు నిజమైన విజయం అనిపిస్తోంది. నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటానని మాటిస్తున్నాను. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ‘ఉప్పెన’ సినిమా సమయం నుంచి మైత్రీ రవి గారితో మంచి పరిచయం ఉంది. ఆయన నాకు ఈ పరిశ్రమలో ఒక గైడ్‌లా మార్గనిర్దేశం చేస్తుంటారు. అలాగే, ఇండస్ట్రీ స్ట్రైక్ సమయంలో అండగా నిలిచిన సుప్రియ అక్క, స్వప్న అక్కలకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని తెలిపారు.

సినిమా గురించి ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘‘వేసవిలో కుటుంబమంతా కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ చిత్రాన్ని రూపొందించాం. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. నా టీం సపోర్ట్ వల్లే ఈ విజయం సాధ్యమైంది. ప్రమోషన్ల విషయంలో సంగీత్, నయన్, గెటప్ శ్రీను ఇలా ఎవరూ ఎలాంటి కండీషన్స్ పెట్టకుండా పూర్తి సహకారం అందించారు. మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌కు రమేష్ గారు పెద్ద పిల్లర్‌గా నిలిచారు. మీడియా కూడా మా సినిమాకు ఎంతో మద్దతు ఇచ్చింది. ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు, నేటి నుంచి సింగిల్ స్క్రీన్లలో ‘రాకాస’ టికెట్ ధరను కేవలం 100 రూపాయలకే అందిస్తున్నాం. దయచేసి అందరూ థియేటర్లలోనే సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అని విజ్ఞప్తి చేశారు.



Niharika Konidela
Rakasa Movie
Sangeeth Shobhan
Nayan Sarika
Pink Elephant Pictures
Telugu Movie Success
Box Office Hit
Telugu Cinema
Manasa Sharma
Movie Distributors

More Telugu News