ఒంట్లో వేడిని తగ్గించేందుకు చిన్న చిట్కా ఇదిగో!
వేసవి కాలంలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య శరీరంలో అధిక వేడి (బాడీ హీట్). దీనివల్ల కాళ్ల మంటలు, నిద్రలేమి వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఒక సులభమైన చిట్కా అందుబాటులో ఉంది. ఇది తరతరాలుగా చాలామంది ఇళ్లలో పాటిస్తున్నదే.
శరీరంలో వేడి ఎక్కువై రాత్రిపూట కాళ్ల మంటలతో నిద్రపట్టని వారు ఈ చిన్న టెక్నిక్‌ను ప్రయత్నించవచ్చు. రాత్రి పడుకోవడానికి ముందు, కొద్దిగా ఆముదం లేదా కొబ్బరి నూనెను తీసుకుని అరికాళ్లకు రాయాలి. ఆ తర్వాత సుమారు రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి.
ఈ విధంగా చేయడం వల్ల శరీరంలోని అధిక వేడిని పాదాల ద్వారా బయటకు లాగేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా కాళ్ల మంటలు క్రమంగా తగ్గి, శరీరం చల్లబడుతుంది. ఒళ్లు తేలికపడి, ఒత్తిడి తగ్గి గాఢమైన నిద్ర పడుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకోగల ఈ చిట్కా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో సహాయపడుతుంది.