'కాంతార' వివాదం: క్షమాపణలో చిత్తశుద్ధి లేదు.. కర్ణాటక హైకోర్టులో రణ్‌వీర్‌కు చుక్కెదురు!
'కాంతార: ఛాప్టర్ 1' సినిమాలోని ఓ పాత్రను అనుకరిస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కీలక అడుగు వేశారు. తాను దాఖలు చేసిన క్షమాపణ అఫిడవిట్‌లోని పదజాలంపై ఫిర్యాదుదారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయనను సంతృప్తిపరిచేలా కొత్త అఫిడవిట్‌ను రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నానని కర్ణాటక హైకోర్టుకు తెలిపారు.
గతేడాది గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆ కార్యక్రమంలో రణ్‌వీర్.. 'కాంతార' సినిమాలో నటుడు రిషబ్ శెట్టి పోషించిన దైవ పూనకం వచ్చిన పాత్రను అనుకరిస్తూ, దైవాన్ని పొరపాటున 'ఆడ దెయ్యం' అని సంబోధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ రణ్‌వీర్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇవాళ ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎం. నాగప్రసన్న ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. రణ్‌వీర్ తరపున సీనియర్ న్యాయవాది సజన్ పూవయ్య వాదనలు వినిపిస్తూ, ఇప్పటికే కోర్టులో క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేశామని, సంబంధిత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తానని కూడా అందులో పేర్కొన్నామని తెలిపారు. అయితే, ఫిర్యాదుదారు తరపు న్యాయవాది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అఫిడవిట్‌లో నిజమైన పశ్చాత్తాపం కనిపించడం లేదని, అందులోని ఉద్దేశం స్పష్టంగా లేదని వాదించారు. మరింత నిర్దిష్టమైన, స్పష్టమైన క్షమాపణ కోరారు.
దీనిపై స్పందించిన పూవయ్య, తన చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని తనకు తెలియదని, జరిగిన సంఘటనకు చింతిస్తున్నట్లు రణ్‌వీర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారని గుర్తుచేశారు. వివాదం జరిగిన వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పారని కూడా వివరించారు. అయినప్పటికీ ఫిర్యాదుదారు పక్షం సంతృప్తి చెందకపోవడంతో వారిని సంప్రదించి, వారి ఆందోళనలను పరిష్కరించేలా కొత్త అఫిడవిట్‌ను రూపొందిస్తామని పూవయ్య కోర్టుకు తెలియజేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఫిర్యాదుదారుకు సంతృప్తి కలిగించేలా సవరించిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసింది. గతంలో ఈ కేసులో రణ్‌వీర్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు స్టే ఇచ్చినప్పటికీ, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా మాటలు, చేతల్లో జాగ్రత్తగా ఉండాలని, ఏ మత మనోభావాలను దెబ్బతీయవద్దని హెచ్చరించిన విషయం తెలిసిందే.