వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’... ఫస్ట్ సింగిల్ ప్రోమో వ‌చ్చేసింది!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’. హారర్-కామెడీ జానర్‌లో వస్తున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్లను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘కమ్సాహంనిదా’ అనే మొదటి పాట ప్రోమోను తాజాగా విడుదల చేసింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పూర్తి పాటను రేపు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ ప్రోమోను సంగీత దర్శకుడు తమన్, వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ మధ్య సరదా సంభాషణతో ఆసక్తికరంగా కట్ చేశారు. ఇక‌, ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ కమెడియన్ సత్య కీలక పాత్రలో క‌నిపించనున్నారు. భారతీయ యువకుడు కనకరాజుకు, కొరియన్ సంస్కృతికి మధ్య ఉండే సంబంధాన్ని తనదైన కామెడీ శైలిలో మేర్లపాక గాంధీ చూపించబోతున్నారు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, చివరి షెడ్యూల్‌ను దక్షిణ కొరియాలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించనుంది.

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, విక్రమ్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుస పరాజయాల తర్వాత వస్తున్న ఈ విభిన్నమైన కథతో వరుణ్ తేజ్ తప్పక విజయం సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాకు మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా,  ఈ వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Varun Tej
Korean Kanakaraju
Merlapaka Gandhi
Ritika Nayak
UV Creations
First Frame Entertainments
Telugu movie
horror comedy
Sidh Sriram
Thaman

More Telugu News