‘ఐరన్ లెగ్’ విమర్శలపై కృతి శెట్టి ఆవేదన.. నయనతార అండగా నిలిచారన్న యంగ్ బ్యూటీ
టాలీవుడ్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న యంగ్ హీరోయిన్ కృతి శెట్టి, తనపై వస్తున్న ‘ఐరన్ లెగ్’ విమర్శలపై తాజాగా స్పందించారు. ఒక సినిమా విజయం కేవలం నటీనటుల చేతుల్లో పూర్తిగా ఉండదని, అలాంటి సమయంలో తనను లక్ష్యంగా చేసుకుని ఈ విధంగా ముద్ర వేయడం తీవ్రంగా బాధిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సినిమాకు తాను వంద శాతం కష్టపడతానని, పాత్రకు న్యాయం చేసేందుకు ఎక్కడా రాజీ పడనని కృతి స్పష్టం చేశారు.
సినిమా ఫలితం అనేది కథ, దర్శకత్వం, సాంకేతిక అంశాలు వంటి అనేక విషయాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. కేవలం తనను బాధ్యురాలిని చేస్తూ విమర్శించడం సరైంది కాదని, కొన్నిసార్లు అదృష్టం లేకపోవడం వల్లే అవకాశాలు చేజారిపోవడం ఒక నటిగా తనను కృంగదీస్తోందని వాపోయారు. తాను నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రంపై వస్తున్న సందేహాలు కూడా తనను కలవరపెడుతున్నాయని అన్నారు.
ఈ చిత్రంలో తాను ‘ధీమా’ అనే వినూత్న పాత్రలో కనిపిస్తానని, సోషల్ మీడియాకు బానిసై, ఫోన్ లేకపోతే ఉండలేని ‘నోమోఫోబియా’తో బాధపడే యువతి పాత్రలో నటించడం కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. 2040 నేపథ్యంలో కథ సాగినా, ప్రస్తుత తరానికి సులభంగా కనెక్ట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కెరీర్‌లో ఎదురవుతున్న ఇబ్బందుల నడుమ సీనియర్ నటి నయనతార తనకు అండగా నిలిచిన విషయాన్ని కృతి గుర్తుచేసుకున్నారు. ఒక సమస్య ఎదురైనప్పుడు నయనతార స్వయంగా ఫోన్ చేసి సలహాలు ఇచ్చారని, ఆమె గైడెన్స్ ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ ట్రోల్స్‌ను పట్టించుకోనని, విమర్శకులు తమ ఆలోచనా ధోరణి మార్చుకుని సానుకూలంగా ఉండాలని సూచించారు.
ఇక, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తనకు పాతకాలపు ప్రేమంటే ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం తన పూర్తి ఏకాగ్రత నటనపైనే ఉందని, మరో ఐదు నుంచి పది సంవత్సరాల తర్వాతే డేటింగ్, పెళ్లి గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు కృతి శెట్టి వెల్లడించారు.