నాటో దేశాల తీరుపై ట్రంప్ మరోసారి విసుర్లు

Trump Criticizes NATO Allies Again
షార్ట్స్‌లో చూడండి
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి కీలక చర్చలకు రంగం సిద్ధమైంది. ఇందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా నిలవనుంది. చర్చల కోసం ఇరు దేశాల ప్రతినిధి బృందాలు గురువారం రాత్రికి ఇస్లామాబాద్‌కు చేరుకున్నాయి. ఈ భేటీ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పాక్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. చర్చలకు వచ్చే బృందాలకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు.

అయితే, ఈ చర్చలకు ముందే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఇలాంటి పరిస్థితుల్లో చర్చలు జరపడం అర్థరహితమని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాటో మిత్రదేశాలపై మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. "ఒత్తిడి చేస్తే తప్ప మనల్ని నిరాశపరిచే నాటో సహా మిత్ర దేశాలకు ఏమీ అర్థం కాదు" అని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. గతంలో ఇరాన్‌పై చర్యలు, హర్మూజ్ జలసంధి వద్ద భద్రత విషయంలో నాటో దేశాలు సహకరించలేదని ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.



Go Back to Shorts
Donald Trump
NATO
Iran
Pakistan
Islamabad
Israel
Lebanon
US Iran talks
US relations
Iran relations

More Telugu News