దళపతి విజయ్ చివరి సినిమాకు షాక్.. ‘జన నాయగన్’ సీన్స్ లీక్!

Vijay Jan Nayagan Movie Leaked Online
షార్ట్స్‌లో చూడండి
దళపతి విజయ్ పూర్తిస్థాయి రాజకీయ ప్రవేశానికి ముందు నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’కు భారీ షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన 5 నిమిషాల నిడివి గల ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో లీక్ అయింది. టైటిల్ క్రెడిట్స్, విజయ్ ఇంట్రడక్షన్ సీన్‌తో కూడిన ఈ వీడియో వేగంగా వ్యాపిస్తుండటంతో చిత్రబృందం, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ వీడియో లీక్ కావడం వెనుక కుట్ర కోణం ఉందని విజయ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎవరూ షేర్ చేయవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎడిట్ టేబుల్ నుంచే ఈ వీడియో బయటకు వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వెంటనే రంగంలోకి దిగి, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి లీకైన వీడియోలను తొలగించే చర్యలు ప్రారంభించింది.

వాస్తవానికి ఈ చిత్రం జనవరి 9నే విడుదల కావాల్సి ఉండగా, కొన్ని సన్నివేశాలు ప్రజా మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరం తెలపడంతో వాయిదా పడింది. నెల రోజుల  న్యాయపోరాటం తర్వాత, మేకర్స్ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపారు. విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకే ఈ చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ రావొచ్చని ప్రచారం జరుగుతోంది.

రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాశ్ రాజ్, గౌతమ్ మీనన్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Go Back to Shorts
Vijay Thalapathy
Jan Nayagan
Vijay movie leak
Tamil cinema
Pooja Hegde
Bobby Deol
Tamil Nadu politics
Central Board of Film Certification
KVN Productions
Tamizhaga Vetri Kazhagam

More Telugu News