శత్రువులు మాపై విజయం సాధించలేరు: ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి

తమపై ఆంక్షలు విధించిన శత్రువులు విజయం సాధించలేరని ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి మొహమ్మద్ ఎస్లామీ అన్నారు. కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో యురేనియం శుద్ధి అంశాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం తమ హక్కు అని స్పష్టం చేశారు. ఇరాన్ హక్కుల పరిరక్షణ అత్యవసరమని వ్యాఖ్యానించారు.

అమెరికాతో జరిపే ఎటువంటి కాల్పుల విరమణ చర్చల్లోనూ తమ హక్కుల పరిరక్షణే అత్యవసర అంశంగా ఉండాలని చెప్పారు. తమపై ఆంక్షలు విధిస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం అమెరికా, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడితో ఉద్రిక్త పరిస్థితులు తిరిగి తలెత్తాయి.

Mohammad Eslami
Iran
Nuclear Energy
Uranium Enrichment
USA
Sanctions
Ceasefire
Israel
Lebanon

More Telugu News