బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా: కేటీఆర్‌తో భేటీ అనంతరం జీవన్ రెడ్డి

తాను బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ప్రకటించారు. శేషజీవితంలో కేసీఆర్‌తో పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా పాటుపడవచ్చని పేర్కొన్నారు.

అంతకుముందు, జగిత్యాలలో జీవన్ రెడ్డిని బీర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. హైదరాబాద్ నుంచి జగిత్యాలకు చేరుకున్న కేటీఆర్... జీవన్ రెడ్డితో ఆయన నివాసంలో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ వెంట ఎల్. రమణ, పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు.

Jeevan Reddy
BRS Party
KTR
Telangana Politics
Jagityala
KCR
Congress Party
Telangana Rashtra Samithi

More Telugu News