ఎమోషన్ తో యాక్షన్ లోకి దిగిపోయే 'డెకాయిట్'

యాక్షన్ థ్రిల్లర్  సినిమాలతో ఎక్కువ మార్కులు కొట్టేసే హీరోల జాబితాలో అడివి శేష్ పేరు తప్పకుండా కనిపిస్తుంది. ఈ జోనర్ పై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టడం .. ఆ తరహా పాత్రలలో రాణించడమే అందుకు కారణమని చెప్పుకోవాలి. ఆయన హైట్ .. ఫిట్ నెస్ .. చురుకైన చూపులు .. ఈ తరహా పాత్రలకు ప్రధానమైన బలంగా నిలుస్తున్నాయి. అలాంటి అడివి శేష్ తాజా చిత్రంగా రూపొందినదే 'డెకాయిట్'. 'ఒక ప్రేమకథ' అనేది ట్యాగ్ లైన్.

షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు. అడివి శేష్ జోడీగా మృణాల్ ఠాకూర్ కనిపించనుంది. ఇక విలన్ పాత్రలో అనురాగ్ కశ్యప్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇతర కీలమైన పాత్రలలో ప్రకాశ్ రాజ్ .. సునీల్ .. కామాక్షి భాస్కర్ల కనిపించనున్నారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా నడిచే ఈ సినిమా, రేపు థియేటర్లకు రానుంది.    

కరోనా కాలంలో .. ఆసుపత్రి మాఫియా నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఆసుపత్రులు డిమాండ్ చేసిన డబ్బును సంపాదించడం కోసమే హీరో డెకాయిట్ గా మారతాడని అంటున్నారు. యాక్షన్ కీ .. ఎమోషన్ కి మధ్య నడిచే సున్నితమైన లవ్ స్టోరీ యూత్ ను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. విజువల్స్  పరంగా .. నేపథ్య సంగీతం పరంగా ఈ సినిమా ఆడియన్స్ కి ఒక గొప్ప ఫీలింగ్ ను కలిగిస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో అడివి శేష్ కి మరో హిట్ దొరుకుతుందేమో చూడాలి. 


Adivi Sesh
Decoit
Decoit Movie
Mrunal Thakur
Anurag Kashyap
Telugu Movie
Action Thriller
Love Story
Hospital Mafia
Prakash Raj

More Telugu News