ఏపీ, తెలంగాణ ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సురేశ్ బత్తిని నియామకం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సురేశ్ బత్తిని నియమితులయ్యారు. ప్రస్తుతం మోరంపూడి అనిల్ కుమార్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా ఉన్నారు. ఆయన స్థానంలో సురేశ్ బత్తిని బాధ్యతలు చేపడుతారు. వీరిద్దరూ తెలుగువారే. సురేశ్ బత్తినిని నియమిస్తూ కేంద్రప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది.

సురేశ్ బత్తిని గతంలో హైదరాబాద్ రీజియన్‌లో చీఫ్ కమిషనర్‌గా పని చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని పన్నుల పరిపాలన, ఆదాయ వసూళ్ల లక్ష్యాలు, శాఖాపరమైన అంశాలపై ఆయనకు పూర్తిస్థాయి అవగాహన ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపన్ను శాఖకు సంబంధించి అత్యున్నత పదవి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పదవి. పన్ను వసూళ్ల లక్ష్యాలను పర్యవేక్షించడంతో పాటు చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడం, శాఖాపరమైన పరిపాలనను సమన్వయం చేయడం వంటివి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ప్రధాన బాధ్యతలు.

Suresh Bathini
Income Tax Department
Principal Chief Commissioner
Telangana
Andhra Pradesh

More Telugu News