హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు

Ships Turn Back Amid Rising Tensions
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది. కానీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారియి. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీనితో జలసంధిని దాటేందుకు వచ్చిన నౌకలు తిరుగుముఖం పట్టాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

అమెరికా, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత పలు నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాయి. గ్రీక్‌కు చెందిన బల్క్ క్యారియర్ 'ఎన్‌జే ఎర్త్', లైబీరియా జెండా కలిగిన 'డేటోనా బీచ్' అనే రెండు నౌకలు ఈ జలసంధిని దాటాయి. అదే సమయంలో 'ఏయూఆర్‌ఓయూఆర్ఏ' నౌక ఈ జలసంధిని దాటేందుకు సిద్ధమైన సమయంలో ఉద్రిక్తతలు తిరిగి చోటు చేసుకున్నాయి.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 250 మందికి పైగా మృతి చెందారు. దీనితో ఇరాన్ హర్మూజ్‌ను మూసివేసింది. దీనితో ముసందమ్ తీరం సమీపంలో ఈ నౌక వెనక్కి మళ్లింది. హర్మూజ్‌ను దాటేందుకు సిద్ధమైన మరిన్ని నౌకలు కూడా వెనుదిరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
Go Back to Shorts
Hormuz Strait
Iran
United States
Israel
Lebanon
Middle East Conflict
Maritime Shipping
Oil Tankers
Geopolitics
International Relations

More Telugu News