కోహ్లీతో పోలిక... జర్నలిస్టుపై బాబర్ అజామ్ ఆగ్రహం!
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026లో, స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ మైదానం బయట తన అసహనాన్ని ప్రదర్శించాడు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో తనను పోలుస్తూ ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు తీవ్రంగా స్పందించాడు.
హైదరాబాద్ కింగ్స్‌మెన్‌పై పెషావర్ జల్మీ చివరి బంతికి ఉత్కంఠ విజయం సాధించిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో పెషావర్ 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగా, బాబర్ అజామ్ 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అయితే, జట్టు గెలిచినప్పుడు అతను క్రీజులో లేకపోవడంతో, మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ జర్నలిస్టు కోహ్లీలా మ్యాచ్‌లను ముగించడంలో విఫలమవుతున్నారా అని ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నకు బాబర్ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. "ఈ పోలికలను ఇకనైనా ఆపండి. ఈ విషయాలను మీలోనే ఉంచుకోండి. పోల్చడం మానేసి ముందుకు సాగండి. నేను మ్యాచ్‌లు ముగించలేనని మీరు తప్పుగా అనుకుంటున్నారు" అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.
పాకిస్థాన్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా పేరుగాంచిన బాబర్ అజామ్, టీ20 ఫార్మాట్‌లో తన స్ట్రైక్ రేట్, మ్యాచ్ ఫినిషింగ్ సామర్థ్యంపై తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ పీఎస్ఎల్ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లలో 126.15 స్ట్రైక్ రేట్‌తో 82 పరుగులు చేశాడు. మరోవైపు, ఐపీఎల్‌లో ఆడుతున్న విరాట్ కోహ్లీ, ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లలో 173.21 స్ట్రైక్ రేట్‌తో 97 పరుగులు సాధించాడు. ముఖ్యంగా ఓ ఛేజింగ్‌లో అజేయంగా 69 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.