‘డెకాయిట్’కు భారీ క్రేజ్... విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌ మోత

Adivi Sesh Decoyit Creates Sensation With Advance Bookings
షార్ట్స్‌లో చూడండి
యంగ్ హీరో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్’ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతుండటం సినిమాపై ఉన్న బజ్‌కు అద్దం పడుతోంది.

విడుదలకు ఒక రోజు ముందే, యూఎస్ ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 220,000 డాలర్లకు (సుమారు రూ. 1.80 కోట్లు) పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో గత 24 గంటల్లోనే దాదాపు 30,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ అసాధారణ స్పందనతో సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, యూఎస్‌లో ప్రీమియర్ల కోసం 14,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో అదవి శేష్ నటించిన 'మేజర్' చిత్రం సాధించిన ప్రీమియర్ వసూళ్లను 'డెకాయిట్' అధిగమించడం విశేషం. సినిమాపై ఉన్న భారీ అంచనాలకు ఈ అడ్వాన్స్ బుకింగ్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఓవర్సీస్‌లో మోక్ష మూవీస్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తోంది.

దర్శకుడిగా షనీల్ డియోకు ఇది తొలి చిత్రం. అడవి శేష్, షనీల్ డియో కలిసి ఈ చిత్రానికి కథ అందించారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను చిత్రీకరించారు.

ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, అనురాగ్ కశ్యప్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన డెకాయిట్ ట్రైలర్‌కు మంచి స్పందన రాగా, బాలీవుడ్ అగ్ర నటుడు ఆమిర్ ఖాన్ కూడా ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, సుప్రియా యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
Go Back to Shorts
Adivi Sesh
Decoyit Movie
Mrunal Thakur
Adivi Sesh Decoyit
Telugu cinema
Advance bookings
Shaniel Deo
Prakash Raj
Anurag Kashyap
Tollywood

More Telugu News