తీవ్ర ఉద్రిక్తతల నడుమ హర్మూజ్ దాటి భారత్ చేరుకున్న 'గ్రీన్ ఆశా'
పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ, భారత ఇంధన సరఫరా వ్యవస్థలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. 'గ్రీన్ ఆశా' అనే భారతీయ జెండా కలిగిన ఎల్‌పీజీ నౌక, 15,400 టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ)తో గురువారం నవీ ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్‌పీఏ)కు సురక్షితంగా చేరుకుంది.
భౌగోళికంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటిన ఈ నౌక, జేఎన్‌పీఏలోని భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), ఇండియన్ ఆయిల్ (ఐఓసీఎల్) నిర్వహిస్తున్న లిక్విడ్ బెర్త్‌లో లంగరు వేసింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రారంభమైన తర్వాత జేఎన్‌పీఏకు చేరుకున్న మొట్టమొదటి ఎల్‌పీజీ నౌక ఇదే కావడంతో దీనిని ఒక ముఖ్యమైన మైలురాయిగా అధికారులు అభివర్ణించారు. నౌకలోని సిబ్బంది, కార్గో అంతా సురక్షితంగా ఉన్నట్లు జేఎన్‌పీఏ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇటీవల ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి హర్మూజ్ జలసంధిని దాటిన ఎనిమిదో భారత నౌక 'గ్రీన్ ఆశా'. క్లిష్టమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లోనూ దేశానికి అవసరమైన నిత్యావసర సరుకుల సరఫరాను నిరంతరాయంగా కొనసాగించే భారత సముద్ర రవాణా సామర్థ్యానికి ఈ సంఘటన నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నౌక రాకతో దేశీయ ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థకు మరింత భరోసా లభించినట్లయింది.