జగిత్యాలకు బయలుదేరిన కేటీఆర్.. కాసేపట్లో జీవన్ రెడ్డితో భేటీ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలవనున్నారు. ఇందుకోసం కేటీఆర్ జగిత్యాలకు బయలుదేరారు. జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఇటీవలే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీతో జతకట్టడంతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే.

కేటీఆర్ జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్నారు. కేటీఆర్ రాక నేపథ్యంలో జగిత్యాల శివారులో బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీతో వారు జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఈ సమయంలో కేటీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది.

KTR
KT Rama Rao
Jeevan Reddy
BRS
Jagityal
Telangana Politics
Congress Party
Sanjay Kumar

More Telugu News