ఒక్క పరుగు తేడాతో గెలిచిన గుజరాత్... ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమి
ఐపీఎల్ 2026లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై థ్రిల్లింగ్ విజయం సాధించింది. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమైన దశలో, బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
చివరి ఓవర్ తొలి బంతికే విప్రాజ్ నిగమ్ ఫోర్ కొట్టడంతో ఢిల్లీ గెలుపు ఖాయమనిపించింది. కానీ, తర్వాతి బంతికే నిగమ్‌ను ఔట్ చేసిన ప్రసిద్ధ్, మ్యాచ్‌ను గుజరాత్ వైపు తిప్పాడు. నాలుగో బంతిని డేవిడ్ మిల్లర్ సిక్సర్‌గా మలచడంతో సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఐదో బంతికి పరుగు రాకపోవడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా, మిల్లర్ షాట్ మిస్ అవ్వగా.. పరుగు కోసం ప్రయత్నించిన కుల్దీప్ రనౌట్ కావడంతో గుజరాత్ సంబరాల్లో మునిగిపోయింది.
211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకు పోరాడింది. కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 92) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు అంచుల వరకు తెచ్చాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 17 పరుగులిచ్చి 3 వికెట్లతో ఢిల్లీని దెబ్బకొట్టాడు. అంతకుముందు, గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (70), జోస్ బట్లర్ (52), వాషింగ్టన్ సుందర్ (55) అర్ధ సెంచరీలతో జట్టుకు భారీ స్కోరు అందించారు.