అమెరికాకు 47 ఏళ్లుగా పొంచి ఉన్న ముప్పు తొలగిపోయింది: పీట్ హెగ్సెత్
"అమెరికాకు 47 ఏళ్లుగా ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పు ఇప్పుడు తొలగిపోయింది" అని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఒక ప్రకటన చేశారు. ఇరాన్‌తో రెండు వారాల షరతులతో కూడిన కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత, తొలిసారిగా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ చారిత్రక ఘనత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కే దక్కుతుందని, ఆయన చరిత్ర సృష్టించారని హెగ్సెత్ కొనియాడారు.
'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో చేపట్టిన సైనిక చర్య చారిత్రాత్మకమైనదని, అమెరికా దళాలు ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశాయని ఆయన వివరించారు. "ఈ కాల్పుల విరమణ కోసం ఇరాన్ మమ్మల్ని వేడుకుంది. ఈ విషయం మనందరికీ తెలుసు" అని హెగ్సెత్ వ్యాఖ్యానించారు.
అమెరికా సైనిక లక్ష్యాలన్నీ నెరవేరాయని, ఇరాన్ నౌకాదళం, వాయుసేనను పూర్తిగా తుడిచిపెట్టేశామని, ప్రస్తుతం ఇరాన్ గగనతలం తమ ఆధీనంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే చాలా సంవత్సరాల పాటు ఇరాన్ సైన్యం యుద్ధం చేయలేని విధంగా నిర్వీర్యం చేశామన్నారు. ఈ యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో సహా పలువురు సీనియర్ నాయకులు హతమయ్యారని కూడా ఆయన వెల్లడించారు.
ఇరాన్ అణుబాంబును కలిగి ఉండకూడదనే విషయంలో అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచి స్పష్టంగా ఉన్నారని హెగ్సెత్ గుర్తుచేశారు. చర్చల ఒప్పందం ప్రకారం, ఇరాన్లో ఉండకూడని అణు పదార్థాలన్నింటినీ తొలగిస్తామని హామీ ఇచ్చారు. భరించలేని సైనిక ఒత్తిడి వల్లే ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ వాషింగ్టన్ షరతులను తిరస్కరించి ఉంటే, వారి విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు, చమురు-ఇంధన మౌలిక సదుపాయాలే తదుపరి లక్ష్యాలుగా ఉండేవని హెచ్చరించారు. వాటిని పునర్నిర్మించుకోవడానికి ఇరాన్‌కు దశాబ్దాలు పట్టేదని, కానీ అధ్యక్షుడు ట్రంప్ వారిపై కరుణ చూపారని వ్యాఖ్యానించారు.
ఈ రోజును 'ప్రపంచ శాంతికి ఒక మంచి రోజు' అని అభివర్ణించిన హెగ్సెత్, ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ను "ధైర్యమైన, సుముఖంగా ఉన్న, సమర్థవంతమైన మిత్రదేశం" అని ప్రశంసించారు. అమెరికాకు మిత్రపక్షాలుగా చెప్పుకునే ఇతర దేశాలు ఇజ్రాయెల్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఈ కాల్పుల విరమణ నిజమైన శాంతికి, నిజమైన ఒప్పందానికి ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రస్తుతానికి తమ శాఖ తన పని పూర్తి చేసిందని, అయితే ఇరాన్ ఒప్పందంలోని ప్రతి నిబంధనను పాటించేలా చూసేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని హెగ్సెత్ స్పష్టం చేశారు.