బేగంపేటలో పైలట్ శిక్షణా విద్యార్థినిపై అత్యాచారం

trainee woman pilot sexually assaulted in begumpet
షార్ట్స్‌లో చూడండి

హైదరాబాద్‌లోని బేగంపేటలో ఒక పైలట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయుడే విద్యార్థినిపై అఘాయిత్యానికి ఒడిగట్టడం విచారకరం.


వివరాల్లోకి వెళితే... బేగంపేటలో ఉన్న పైలట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న ఓ యువతిపై అదే సంస్థలో పనిచేస్తున్న నసీముద్దీన్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేరళకు చెందిన నిందితుడు, గతేడాది జనవరిలో శిక్షణ ఇస్తాననే సాకుతో ఆమెపై అత్యాచారం చేశాడు.


మొదటిసారి అఘాయిత్యం చేసిన సమయంలో ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసిన నిందితుడు, వాటిని సోషల్ మీడియాలో పెడతానని బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడి వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు ఎట్టకేలకు బేగంపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ వేధింపుల్లో దమ్మాయిగూడకు చెందిన సల్మాన్ అనే వ్యక్తి కూడా నిందితుడికి సహకరించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు నసీముద్దీన్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

Go Back to Shorts
Woman trainee pilot
begumpet
Sexual assault
hyderabad

More Telugu News