Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాటికి దూరంగా ఉండండి: యువతకు రజనీకాంత్ కీలక సూచన

Rajinikanth Warns Youth About Drugs and Dangerous Stunts
Advertisement
  • సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో చేయవద్దన్న రజనీ
  • డ్రగ్స్, మద్యంకు బానిస కావద్దని హితవు
  • అలవాట్లు సరిగ్గా లేని స్నేహితులకు దూరంగా ఉండాలని సూచన
Advertisement

సూపర్‌స్టార్ రజనీకాంత్ యువతను ఉద్దేశించి అత్యంత కీలకమైన, భావోద్వేగపూరితమైన సందేశాన్ని ఇచ్చారు. సినిమాల్లోని సాహసాలను చూసి నిజ జీవితంలో ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన హితవు పలికారు.


ప్రస్తుత కాలంలో యువత తప్పుడు మార్గాల్లో వెళ్లడంపై రజనీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డ్రగ్స్, మద్యం వంటి భయంకరమైన వ్యసనాలకు బానిసలైతే తమ జీవితాలే కాకుండా, వారిని నమ్ముకున్న తల్లిదండ్రుల జీవితాలు కూడా నాశనమవుతాయని హెచ్చరించారు. "క్రమశిక్షణ లేని జీవితం నరకంతో సమానం" అని ఆయన స్పష్టం చేశారు.


సినిమాల్లో హీరోలు చేసే స్టంట్లు చూసి స్ఫూర్తి పొంది రోడ్లపై బైక్ రేసింగ్‌లు చేయడం ప్రాణాపాయమని, అటువంటి పనులకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశలో చదువుపైనే పూర్తి నిబద్ధతతో ఉండాలని, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నారు. అలవాట్లు సరిగ్గా లేని స్నేహితులకు దూరంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యతని గుర్తుచేశారు.

తన సినిమాల గురించి మాట్లాడుతూ... అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. అలాగే సిబి చక్రవర్తి దర్శకత్వంలో, కమల్ హాసన్ నిర్మాణంలో రాబోతున్న ‘తలైవర్ 173’ ప్రాజెక్ట్ విశేషాలను కూడా పంచుకున్నారు.

Advertisement
Advertisement
Rajinikanth
youth
drugs
alcohol addiction
jailer 2
thalaiver 173
Kamal Hassan
bike racing
education
discipline

More Telugu News