విజయ్ 'జన నాయగన్' విడుదల ఆలస్యం... నో కామెంట్ అన్న రజినీకాంత్!
- 'జన నాయగన్' విడుదల ఆలస్యంపై మీడియా ప్రశ్న
- ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనన్న రజినీకాంత్
- జైలర్-2 చిత్రం షూటింగ్ రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని వెల్లడి
'జన నాయగన్' చిత్రం విడుదలపై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఉద్దేశపూర్వకంగా వివిధ కారణాలు చూపిస్తూ చిత్రం విడుదల కాకుండా అడ్డుకుంటుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఈ అంశంపై రజినీకాంత్‌ను అడిగారు.
కమల్ హాసన్‌తో నటిస్తున్న ఆర్కే x కేహెచ్ గురించి ప్రశ్నించగా, ఈ మల్టీస్టారర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలిపారు. ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని అన్నారు. 'జైలర్-2' చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానుందని తెలిపారు. సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటిస్తుందని అన్నారు.