యుద్ధం వారిది, లాభం ఒమన్‌ది.. సీజ్‌ఫైర్ డీల్‌తో కాసుల పంట!

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. ఇరు దేశాలు రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే, ఈ ఒప్పందంలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. ఈ ఘర్షణతో ప్రత్యక్ష సంబంధం లేని ఒమన్ దేశం ఆర్థికంగా భారీగా లాభపడనుండటం. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు కుదిరిన ఒప్పందంలోని ఓ నిబంధన ఒమన్‌కు కాసుల వర్షం కురిపించనుంది.

హర్మూజ్ జలసంధికి ఒకవైపు ఇరాన్ ఉండగా, మరోవైపు ఒమన్ భూభాగం (ముసందమ్ ద్వీపకల్పం) ఉంది. తాజా ఒప్పందం ప్రకారం.. ఈ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి నౌక నుంచి ఇరాన్‌తో పాటు ఒమన్ కూడా రవాణా రుసుము (టోల్ ఫీజు) వసూలు చేస్తుంది. ఒక్కో నౌకపై సుమారు 2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.16.7 కోట్లు) వరకు వసూలు చేయనుండగా, ఇందులో ఒమన్‌కు గణనీయమైన వాటా లభించనుంది. దీంతో ఒమన్ ఖజానాకు రోజూ వందల కోట్ల ఆదాయం వచ్చి చేరనుంది.

అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా నెలకొన్న వివాదాల్లో ఒమన్ తరచూ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వస్తోంది. శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించినందుకు ప్రతిఫలంగానే ఇప్పుడు ఈ ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందంతో మధ్యప్రాచ్యంలో ఒమన్ వ్యూహాత్మక ప్రాధాన్యం మరోసారి రుజువైంది.

అయితే, ఈ టోల్ ఫీజు ఏర్పాటుపై కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్, ఒమన్‌లు లాభపడినప్పటికీ, ఈ అదనపు రుసుము భారం చివరికి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులపైనే పడుతుందని విమర్శిస్తున్నాయి. మొత్తం మీద, ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఇరాన్‌కు దాడుల నుంచి ఉపశమనం, అమెరికాకు చమురు రవాణాకు హామీ ఇవ్వగా.. ఎలాంటి ఘర్షణలోనూ పాలుపంచుకోని ఒమన్‌కు మాత్రం ఊహించని రీతిలో భారీ ఆర్థిక లాభాన్ని తెచ్చిపెట్టింది. అందుకే అంతర్జాతీయ మీడియా దీనిని ‘ఒమన్ సైజ్ గెయిన్’‌గా అభివర్ణిస్తోంది.

Oman
Iran
United States
Hormuz Strait
Seizefire deal
Toll fee
Middle East
Oil transport
Geopolitics
Economic impact

More Telugu News