యుద్ధం ఆ మూడు దేశాలది.. మూల్యం మిగతా ప్రపంచానిది.. హర్మూజ్ టోల్!
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరదించుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు తెలిపారు. అయితే, ఈ శాంతి ఒప్పందం వెనుక ఉన్న ఓ షరతు ఇప్పుడు ప్రపంచ దేశాలను, ముఖ్యంగా భారత్ వంటి చమురు దిగుమతి దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఏమిటీ కొత్త షరతు?
ఈ ఒప్పందంలో భాగంగా హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ‘టోల్ ఫీజు’ వసూలు చేసేందుకు ఇరాన్, ఒమన్‌లకు అమెరికా అనుమతించినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం ఈ జలసంధి నుంచే జరుగుతుంది. ఇప్పటివరకు అంతర్జాతీయ జలమార్గంగా ఉన్న దీనిపై ఎలాంటి రుసుములు లేవు. తాజా ఒప్పందం ప్రకారం.. ఈ మార్గంలో వెళ్లే ప్రతి నౌక నుంచి సుమారు 2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.16 కోట్లు) వరకు టోల్ వసూలు చేయవచ్చని అంచనా. యుద్ధం వల్ల దెబ్బతిన్న తమ మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి ఈ నిధులను వినియోగిస్తామని ఇరాన్ వాదిస్తోంది.
ప్రపంచంపై ప్రభావం
ఈ టోల్ భారం నేరుగా చమురు ధరలపై పడుతుంది. రవాణా ఖర్చులు పెరగడంతో ముడిచమురు ధరలు పెరిగి, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతాయి. ఇది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసి, భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ జలమార్గంపై రుసుములు వసూలు చేయడం 'సముద్ర చట్టాల'కు విరుద్ధమని గల్ఫ్ దేశాల కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శాంతి పేరుతో ప్రపంచ దేశాల జేబులకు చిల్లు పెట్టడమేంటని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.