కేరళ ఆలయాలకు అనంత్ అంబానీ రూ.18 కోట్ల భారీ విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కేరళలోని ప్రఖ్యాత ఆలయాల అభివృద్ధి, ఏనుగుల సంరక్షణ కోసం భారీ విరాళం ప్రకటించారు. మొత్తం రూ.18 కోట్లు అందించనున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన ప్రసిద్ధ రాజరాజేశ్వరం, గురువాయూర్ ఆలయాలను సందర్శించారు.
ఈ పర్యటనలో భాగంగా రాజరాజేశ్వరం ఆలయానికి రూ.3 కోట్లు, గురువాయూర్ ఆలయానికి రూ.3 కోట్లు విరాళంగా అందజేశారు. దీనికి అదనంగా, రాజరాజేశ్వరం ఆలయంలో 200 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న పురాతన తూర్పు గోపురం పునరుద్ధరణ పనుల కోసం మరో రూ.12 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
రాజరాజేశ్వరం ఆలయంలో అనంత్ అంబానీ ప్రత్యేక పూజలు చేసి, సంప్రదాయ ఆచారాలు పాటించారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన రూ.3 కోట్ల చెక్కును టీటీకే దేవస్వోం అధ్యక్షుడు టీపీ వినోద్ కుమార్, ఈవో కేపీ వినయన్ వంటి అధికారులకు అందించారు. అనంతరం గురువాయూర్ ఆలయంలోనూ ప్రార్థనలు చేసి రూ.3 కోట్లు విరాళమిచ్చారు.
అంతేకాదు, గురువాయూర్ ఆలయంలోని ఏనుగుల సంక్షేమానికి కూడా అనంత్ ప్రాధాన్యత ఇచ్చారు. తన వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమం 'వంతార' ద్వారా ఏనుగుల కోసం ఆధునిక ఆసుపత్రి, గొలుసులు లేని ఆశ్రయాలు (chain-free shelters) నిర్మించనున్నట్లు తెలిపారు. ఏనుగుల జీవన పరిస్థితులను మెరుగుపరచి, వాటికి శాస్త్రీయ పద్ధతుల్లో సంరక్షణ అందించడమే తమ లక్ష్యమని వివరించారు.
"భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు. అవి విశ్వాసం, సమాజం, కరుణ, ప్రకృతితో మనకున్న సంబంధాన్ని పోషించే జీవన సంస్థలు. ఈ పవిత్ర వారసత్వాన్ని భవిష్యత్ తరాల కోసం కాపాడటం మనందరి బాధ్యత" అని ఈ సందర్భంగా అనంత్ అంబానీ అన్నారు. తమ సేవల ద్వారా భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు, జంతువులకు గౌరవంతో కూడిన సంరక్షణ అందించాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.