రైలు ప్రయాణాలపై ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్‌లోని రైళ్ల రాకపోకలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 12 గంటల పాటు రైలు ప్రయాణాలు చేయొద్దని, రైలు మార్గాలకు సమీపంలో ఉండే ప్రజలు దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. ఈ మేరకు 'ఎక్స్' ఖాతాలో ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) పోస్టు పెట్టింది.

మీ భద్రత దృష్ట్యా ఇప్పటినుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు దేశవ్యాప్తంగా ఉన్న రైళ్ల మార్గాలకు దూరంగా ఉండాలని, రైలు ప్రయాణాలు మానుకోవాలని ఆ పోస్టులో సూచించింది. అక్కడ మీరు ఉంటే మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చని పేర్కొంది. ఇరాన్ కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇది వర్తిస్తుందని తెలిపింది. దీనిని అత్యవసర హెచ్చరికగా పేర్కొంది. అయితే ఏ ఏ ప్రాంతాల్లోని రైల్వే మార్గాలు అనే విషయాన్ని మాత్రం అందులో పేర్కొనలేదు.

Israel
Iran
Israel Iran conflict
Iran train travel
Israel Defense Forces
Middle East tensions
IDF

More Telugu News