మణిపూర్‌లో రాకెట్ దాడి... ఇద్దరు చిన్నారుల మృతి

మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో ఒక ఇంటిపైకి రాకెట్ దూసుకు వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మంగళవారం ఉదయం మొయిరాంగ్ గ్రామంలోని ట్రింగ్లాబి అవాంగ్ లేకై అనే ప్రాంతంలో జరిగింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, సమీపంలోని కొండ ప్రాంతం నుంచి దీనిని ప్రయోగించినట్లు భావిస్తున్నారు. ఇక్కడ పోస్టింగ్‌లో ఉన్న సరిహద్దు భద్రతా దళ అధికారి ఒయినం మలెంగాన్బా నివాసంపైకి ఈ రాకెట్ దూసుకువచ్చింది. ఘటన జరిగినప్పుడు అతని భార్య ఒయినం ఒంగ్బీ బినీతా(37), ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లల్లో ఒకరు ఐదేళ్ల బాలుడు, ఐదు నెలల పసికందు ఇంట్లో ఉన్నారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

వీరిని వెంటనే ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించగా, ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతూ మరణించారు. తీవ్రంగా గాయపడిన బినీతకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇంటిపై ఏదో భారీ వస్తువు పడిన శబ్దం వినిపించిందని గ్రామస్థులు చెబుతున్నారు.

Manipur Attack
Manipur
Bishnupur District
Rocket Attack
Children Death
Moiraing Village
BSF

More Telugu News