5 కిలోల గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం తీపికబురు

Central Government Announces Good News on 5kg Gas Cylinder
షార్ట్స్‌లో చూడండి
వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్యాస్ సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి 5 కిలోల ఎఫ్‌టీఎల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా రెట్టింపు చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. దేశంలోని చమురురంగ సంస్థల సహాయంతో పౌరసరఫరాల శాఖ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని సూచించారు.

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో 5 కిలోల బరువుండే 'ఛోటు' సిలిండర్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పట్టణాలు, నగరాలలో నివసించే వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఈ సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ గ్యాస్ కనెక్షన్లకు అడ్రస్ ప్రూఫ్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే 5 కిలోల సిలిండర్‌ను పొందవచ్చు.

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత లేకుండా చూడటం, వలస కార్మికులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు గ్యాస్ కొనాల్సిన అవసరం లేకుండా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చమురు రంగ కంపెనీల ద్వారా ఈ అదనపు సరఫరాను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని కేంద్రం నిర్ణయించింది.
Go Back to Shorts
Central Government
5kg gas cylinder
Migrant workers
Gas supply
Petroleum Ministry
FTL gas cylinder

More Telugu News