Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్... ఈ నెల 28న చంద్రబాబు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి రాబోతోంది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మెగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ కూడా హాజరుకానున్నారు.
గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్, అదానీ ఇన్ఫ్రా సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ డేటా సెంటర్ కోసం మొత్తం 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.27 లక్షల కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నారు. దీనిని 1000 మెగావాట్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయనున్నారు. శంకుస్థాపన అనంతరం నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమవుతాయి.
ఈ భారీ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖ పరిధిలోని మూడు ప్రాంతాల్లో 601.4 ఎకరాల భూమిని కేటాయించింది. వీటిలో తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాలు ఉన్నాయి. ప్రస్తుతం తర్లువాడలో స్థలాన్ని చదును చేసే పనులు కూడా జరుగుతున్నాయి.
ప్రభుత్వ లక్ష్యం ప్రకారం, ఈ ప్రాజెక్టును 2028 జులై నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖ నగరం టెక్ హబ్‌గా మరింత అభివృద్ధి చెందడంతో పాటు, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది.