Mohsin Naqvi: ఐపీఎల్‌కు పీసీబీ ఛైర్మన్ సవాల్: వాస్తవాలు ఏం చెబుతున్నాయి?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లక్ష్యంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన లీగ్‌గా వెలుగొందుతున్న ఐపీఎల్‌ను తమ దేశపు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) త్వరలోనే అధిగమిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


పీఎస్ఎల్ 11వ సీజన్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో నఖ్వీ మాట్లాడారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, పెట్టుబడిదారులకు ఇది ఆకర్షణీయమైన మార్కెట్‌గా మారిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఐపీఎల్‌ను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే నంబర్ వన్ ఫ్రాంచైజీ లీగ్‌గా పీఎస్ఎల్ అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


మరోవైపు, క్షేత్రస్థాయిలో గణాంకాలకు, నఖ్వీ మాటలకు పొంతన లేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఐపీఎల్ విలువ సుమారు 6 బిలియన్ డాలర్లు కాగా, పీఎస్ఎల్ విలువ కేవలం 93 మిలియన్ డాలర్లు మాత్రమే. ఐపీఎల్ ఏడాదికి 1 బిలియన్ డాలర్లకు పైగా ఆర్జిస్తుంటే, పీఎస్ఎల్ ఆదాయం కేవలం 60 మిలియన్ డాలర్ల వద్దే ఉంది.

పీఎస్ఎల్ ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోంది. స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధానికి గురవ్వగా, షహీన్ అఫ్రిది, సికందర్ రజాలు భద్రతా నిబంధనలు ఉల్లంఘించి క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటున్నారు. భద్రతా కారణాలు, ప్రాంతీయ ఉద్రిక్తతల వల్ల మ్యాచ్‌లను కేవలం రెండు వేదికలకే పరిమితం చేయాల్సి వచ్చింది.


ఆదాయం, వ్యూయర్‌షిప్, నాణ్యత పరంగా ఐపీఎల్ దరిదాపుల్లో కూడా లేని పీఎస్ఎల్... నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందన్న నఖ్వీ వ్యాఖ్యలు కేవలం ప్రగల్భాలేనని క్రీడా పండితులు కొట్టిపారేస్తున్నారు.

Mohsin Naqvi
PSL vs IPL
Pakistan Super League
Indian Premier League
PSL Chairman
Cricket
PCB
Cricket News
Fakhar Zaman
Shaheen Afridi

More Telugu News