Ruturaj Gaikwad: నేను రాణించి ఉంటే బాగుండేది.. ఓటమికి నాదే పూర్తి బాధ్యత: చెన్నై కెప్టెన్

నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో 43 పరుగుల తేడాతో ఓడిపోవడంతో, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐపీఎల్-2026 సీజన్‌లో వరుసగా మూడవ ఓటమిని చవిచూసింది. ఈ సీజన్‌లో సీఎస్కే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. -2.517 నెట్ రన్ రేట్‌తో పట్టికలో అట్టడుగున ఉంది. ఒక ఐపీఎల్ సీజన్ ఆరంభంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది రెండవ అతి పెద్ద ఓటమి. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఓటమికి పూర్తి బాధ్యత వహించాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా తాను రాణించి ఉంటే బాగుండేదని, అప్పుడు పరిస్థితి మరోలా ఉండేదేమోనని రుతురాజ్ అభిప్రాయపడ్డాడు. అందుకే ఈ ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నానని తెలిపాడు. బౌలింగ్ చేసే సమయంలో 14వ ఓవర్ వరకూ మ్యాచ్ చెన్నై చేతుల్లోనే ఉందని, ఆ తర్వాతే పరిస్థితి మారిపోయిందని అన్నాడు. టిమ్ డేవిడ్‌ను అన్షుల్ కాంబోజ్ క్లీన్ బౌల్డ్ చేశాడని, కానీ అది నో బాల్ అయిందని గుర్తు చేశాడు.

ఆ తర్వాత డేవిడ్ మరింత దూకుడుగా ఆడాడని చెప్పాడు. అది నోబాల్ కాకపోయి ఉంటే డేవిడ్ అప్పటికే ఔటై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ అంత స్కోర్ చేసి ఉండేది కాదని పేర్కొన్నాడు. లక్ష్య ఛేదనలోను మేం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయామని తెలిపాడు. సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, ఒవర్టన్ రాణించారని తెలిపాడు.
Ruturaj Gaikwad
Chennai Super Kings
CSK
IPL 2026
Royal Challengers Bangalore
RCB
Cricket

More Telugu News