Thummala Nageswara Rao: ఏపీలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపండి... అమిత్ షాకు మంత్రి తుమ్మల లేఖ

భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పాలనా సౌలభ్యం, స్థానిక గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఈ విలీనం అత్యవసరమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తుమ్మల వివరించారు. ఈ గ్రామాలను భద్రాచలంలో విలీనం చేయడం ద్వారా గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ అంశంపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే విలీనానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అమిత్ షాను కోరారు.

స్థానిక సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి, సానుకూలంగా స్పందించాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Thummala Nageswara Rao
Telangana
Andhra Pradesh
Amit Shah
Bhadrachalam
Village Merger
Tribal Issues
Telangana News

More Telugu News