Rashmika Mandanna: 'రణబాలి'లో జయమ్మగా రష్మిక.. బర్త్‌డే వేళ అదిరిపోయే అప్‌డేట్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఆమె నటిస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టుల నుంచి వరుస అప్‌డేట్లు వస్తుండగా, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'రణబాలి' చిత్రం నుంచి వచ్చిన పోస్టర్, స్పెష‌ల్ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో రష్మిక పోషిస్తున్న 'జయమ్మ' పాత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన పోస్టర్‌, మేకింగ్ వీడియోను విడుదల చేసింది. 

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'రణబాలి' అనే భారీ పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇప్పటికే 'టాక్సీవాలా', 'శ్యామ్ సింగరాయ్' వంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్, ఈసారి ఒక పవర్‌ఫుల్ పీరియాడిక్ కథతో రాబోతున్నారు. పుట్టినరోజున 'జయమ్మ'గా రష్మిక అప్‌డేట్ రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

Rashmika Mandanna
Ranabali
Vijay Deverakonda
Rahul Sankrityan
Jayamma
Telugu Movie
Geetha Govindam
Dear Comrade
Tollywood
Birthday Update

More Telugu News