Mysaa Movie: ‘మైసా’ నుంచి రష్మిక ఇంటెన్స్ లుక్.. పుట్టినరోజున పవర్‌ఫుల్ పోస్టర్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ‘మైసా’ నుంచి చిత్ర బృందం ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. రవింద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ ఫీమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా నుంచి వచ్చిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ పోస్టర్‌లో రష్మిక మునుపెన్నడూ చూడని అవతారంలో కనిపించారు. ముఖంపై గాయాలు, రక్తం, మట్టితో ఉన్నప్పటికీ.. ఆమె కళ్లలో మాత్రం బలమైన కసి, ఆగ్రహం కనిపిస్తున్నాయి. తన పాత్ర ఎంతటి భయానక పరిస్థితులను ఎదుర్కొందో ఈ లుక్ స్పష్టం చేస్తోంది. ఇంతకుముందు విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌లు సినిమాపై అంచనాలను పెంచగా, ఈ కొత్త పోస్టర్ ఆ హైప్‌ను మరింత పెంచింది.
గోండు తెగ ప్రజల సాంస్కృతిక నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక ఒక బలమైన గోండు యువతి పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్, భావోద్వేగాల కలబోతగా పాన్-ఇండియా స్థాయిలో అన్‌ఫార్ములా ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రేయాస్ పి కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.