LIK Movie: ప్రేమకు ఇన్సూరెన్స్.. ఆసక్తి రేపుతున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ట్రైలర్

'లవ్ టుడే' చిత్రంతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK). విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా విడుదల చేశారు. ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉంటే ఎలా ఉంటుందనే వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

2040 నాటి భవిష్యత్ ప్రపంచంలో ఈ కథ నడుస్తుంది. ఎవరు ఎవరితో కలిస్తే బాగుంటుందో తేల్చేందుకు ఎస్.జె. సూర్య 'LIK' అనే ఒక యాప్‌ను సృష్టిస్తారు. ఈ యాప్ కారణంగా ప్రేమలో విఫలమైన ఓ యువకుడి (ప్రదీప్ రంగనాథన్) కథే ఈ సినిమా. సోషల్ మీడియా పిచ్చితో ఉండే 'ధీమా' పాత్రలో కృతి శెట్టి, ఆమెను ప్రేమించే 'వైబ్ వాసు'గా ప్రదీప్ కనిపించారు.

ట్రైలర్‌లో ప్రదీప్ రంగనాథన్ తనదైన ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకున్నాడు. "ఇప్పుడు ఒక యాప్ ఒప్పుకోలేదని బ్రేకప్ చెప్తున్నారా?" అంటూ అతను చెప్పే డైలాగ్ నేటి తరం ప్రేమ సంబంధాలపై సెటైర్‌గా ఉంది. "ఒక హార్ట్ చేయగలిగేది ఏ యాప్ చేయలేదని ప్రూవ్ చేస్తా" అనే డైలాగ్‌తో సినిమా ఉద్దేశాన్ని తెలియజేశాడు. ప్రదీప్, కృతి శెట్టిల మధ్య కెమిస్ట్రీ కొత్తగా ఆకట్టుకుంది.

దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంచుకున్న ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్, ఎస్.జె. సూర్య నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం, రవి వర్మన్ కెమెరా పనితనం ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. నయనతార, ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
LIK Movie
Pradeep Ranganathan
Love Insurance Company
Krithi Shetty
Vignesh Shivan
Anil Ravipudi
Telugu Movie Trailer
Love Today
SJ Surya
Anirudh Ravichander

More Telugu News