Chandrababu Naidu: అమరావతికి చట్టబద్ధత: బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు శనివారం ఆయన ఫోన్ చేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతిని రాష్ట్ర ఏకైక, శాశ్వత రాజధానిగా స్థిరపరుస్తూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లు ఆమోదం పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు పార్లమెంట్‌లోని ఉభయ సభలు ఏప్రిల్ 2న ఆమోదం తెలిపాయి. ఈ చట్టంతో అమరావతికి తిరుగులేని చట్టబద్ధత లభించింది. గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న మూడు రాజధానుల వివాదంతో పాటు రాజధానిపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్ధతు పలికేలా సమన్వయం చేసినందుకు నితిన్ నబిన్‌కు ధన్యవాదాలు. అమరావతి విషయంలో ఎన్టీఏ భాగస్వామ్య పార్టీలు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతును ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. కేంద్ర పెద్దల సహకారం, ఎన్టీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. పార్లమెంట్‌లో ఈ చట్టబద్ధతతో అమరావతి అభివృద్ధికి లైన్ క్లీయర్ అవ్వడమే కాకుండా, ఇన్వెస్టర్లలో సైతం రాష్ట్రంపై నమ్మకం రెట్టింపు అవుతుంది,’ అని పేర్కొన్నారు.  
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
Nitin Nabin
AP Capital
Andhra Pradesh Reorganisation Act 2026
AP Politics
BJP
Capital City
One Capital

More Telugu News