Tamil Nadu Election Survey: విజయ్ పార్టీకి 'ఫస్ట్ టైమ్' ఓట్లు.. డీఎంకే కూటమికి సీట్లు.. ఆసక్తికరంగా తమిళనాడు సర్వే ఫలితాలు
తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే కూటమి మరోసారి ఘన విజయం సాధించనుందని రెండు వేర్వేరు సంస్థలు నిర్వహించిన ప్రీ-పోల్ సర్వేలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విపక్షాల ఓట్ల చీలిక డీఎంకేకు భారీగా లాభం చేకూర్చనున్నాయని ఈ సర్వేలు అంచనా వేశాయి.
డీఎంకేకు భారీ మెజారిటీ.. తేల్చేసిన ప్రీ-పోల్ సర్వేలు
లోక్ పోల్ సంస్థ మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 మధ్య 1,17,000 మందితో నిర్వహించిన సర్వే ప్రకారం... మొత్తం 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి 181 నుంచి 189 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడైంది. డీఎంకే కూటమికి 40.1 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 29 శాతం ఓట్లతో 38 నుంచి 42 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) 23.9 శాతం ఓట్లతో 8 నుంచి 10 స్థానాలు దక్కించుకోవచ్చని తెలిపింది.
డీఎంకేకు సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న ‘కలైంజర్ మగళీర్ ఉరిమై తొగై’, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాలల్లో అల్పాహార పథకం వంటివి గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో మహిళలను విశేషంగా ఆకట్టుకున్నాయని, ఇవే డీఎంకే విజయానికి ప్రధాన కారణమని లోక్ పోల్ విశ్లేషించింది. మరోవైపు విపక్షాల ఓట్లు అన్నాడీఎంకే, విజయ్ పార్టీ మధ్య చీలిపోవడం కూడా స్టాలిన్ కూటమికి అతిపెద్ద సానుకూలాంశమని పేర్కొంది. యువత, తొలిసారి ఓటు వేసేవారి నుంచి విజయ్ పార్టీకి మంచి మద్దతు లభిస్తున్నా, ఒంటరిగా పోటీ చేస్తుండటంతో అది సీట్లుగా మారే అవకాశం తక్కువని వివరించింది. అన్నాడీఎంకేలో అంతర్గత కలహాలు, ముఖ్య నేతలు పార్టీని వీడటం, కేడర్ నైతికంగా దెబ్బతినడం వంటివి ఆ పార్టీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సర్వే అభిప్రాయపడింది.
తమిళనాడులో డీఎంకే విజయదుందుభి: పోల్ ట్రాకర్
మరోవైపు పోల్ ట్రాకర్ నిర్వహించిన సర్వే కూడా డీఎంకే కూటమికే పట్టం కట్టింది. ఈ సర్వే ప్రకారం డీఎంకే కూటమి 42.7 శాతం ఓట్లతో 172 నుంచి 178 స్థానాల్లో గెలుపొందనుంది. అన్నాడీఎంకే 46 నుంచి 52 సీట్లతో సరిపెట్టుకుంటుందని అంచనా వేసింది. విజయ్ పార్టీ టీవీకే 19.2 శాతం ఓట్లతో 6 నుంచి 12 సీట్లు గెలుచుకోవచ్చని తెలిపింది. నాయకత్వం విషయంలోనూ ఎడప్పాడి పళనిస్వామి, విజయ్‌లతో పోలిస్తే అనుభవజ్ఞుడైన నేతగా స్టాలిన్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఈ సర్వే పేర్కొంది. మొత్తంగా రెండు సర్వేలు కూడా తమిళనాడులో డీఎంకే హవా కొనసాగుతుందని స్పష్టం చేశాయి.