Tirumala: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు.. భారీగా పెరిగిన నిరీక్షణ సమయం

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవులు కావడంతో తిరుగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శనివారం ఉదయం టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

వరుస సెలవులు, విద్యార్థులకు పరీక్షలు ముగియడం వంటి కారణాలతో స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. భక్తులు వెలుపల కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే 68,445 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ. 3.79 కోట్లుగా నమోదైంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ అధికారులు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి నిరంతరాయంగా అన్నప్రసాదం, తాగునీరు అందిస్తున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తులు సహనంతో వ్యవహరించి, టీటీడీ సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tirumala
Tirumala temple
TTD
Tirupati
Lord Venkateswara
Devotees
Weekend rush
Queue lines
Integrated Command Control Center
Pilgrimage

More Telugu News