Rakasa Movie: 'రాకాస' ప్రీమియర్ షోలో మెగా హీరోల సందడి.. ఇదిగో వీడియో!

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై ఆమె నిర్మించిన రెండో చిత్రం 'రాకాస' ఇవాళ‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ సోషియో-ఫాంటసీ థ్రిల్లర్‌లో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రీమియర్ షోకు మెగా కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు. నిహారికకు మద్దతు తెలిపేందుకు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులు, సాయి ధరమ్ తేజ్, సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల హాజరయ్యారు. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ థియేటర్‌లో విజిల్స్ వేస్తూ తన ఉత్సాహాన్ని ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది.

ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఈ ప్రీమియర్‌కు హాజరై సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన నిహారికను ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, ప్రముఖుల ప్రశంసలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కామెడీ, ఫాంటసీ అంశాలతో 'రాకాస' ప్రేక్షకులను అలరిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Rakasa Movie
Niharika Konidela
Pink Elephant Pictures
Sai Dharam Tej
Varun Tej
Lavanya Tripathi
Naga Ashwin
Telugu movie review
Sangeeth Shobhan
Nayan Sarika

More Telugu News