Donald Trump: ఫ్రాన్స్ అధ్యక్షుడిని భార్య దారుణంగా చూస్తుందన్న ట్రంప్... మెక్రాన్ కౌంటర్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై మెక్రాన్ కూడా స్పందించారు. అమెరికా అధ్యక్ష భవనంలో ఇటీవల జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, మెక్రాన్ భార్య అతడిని చాలా దారుణంగా చూస్తుందని అన్నారు. ఆయన భార్యా బాధితుడు అన్నారు. ఆయన దవడకు తగిలిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదని ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించి వీడియో లీక్ అయింది.

ట్రంప్ వ్యాఖ్యలపై ఫ్రాన్స్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడి వ్యక్తిగత విషయాలు మాట్లాడటమేమిటని అన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలపై మెక్రాన్ కూడా స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని మెక్రాన్ అన్నారు. ఆ వ్యాఖ్యలు హుందాగా, ఆయన స్థాయికి తగినట్లుగా లేవని విమర్శించారు. ఇలాంటి విషయాలు మాట్లాడటానికి బదులు పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు, ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేయాలని సూచించారు. కాగా, మెక్రాన్ భార్య అతనిని తోసేసినట్లు గత ఏడాది ఒక వీడియో వైరల్ అయింది.
Donald Trump
Emmanuel Macron
France
US relations
Brigitte Macron
France President
Trump Macron controversy

More Telugu News