Sonali Bendre: సోనాలి బింద్రేపై భూ కబ్జా ఆరోపణలు.. బ్లాక్ మెయిల్ కోసమేనంటూ నటి ఫైర్!

బాలీవుడ్ నటి సోనాలి బింద్రే భూ వివాదంలో చిక్కుకున్నారు. పూణె జిల్లా లోనావాలా సమీపంలో తన భూమిని సోనాలి కబ్జా చేశారంటూ స్థానిక రైతు ఒకరు పోలీసులను ఆశ్రయించారు. ఈ వార్తలు మీడియాలో రావడంతో సోనాలి బృందం వెంటనే స్పందించి, ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇదంతా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నమేనని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. లోనావాలాలో సోనాలి బింద్రేకున్న ఆస్తి పక్కనే తన పొలం ఉందని, ఆమె తన భూమిలోకి చొరబడి కంచె వేసుకున్నారని రైతు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశ్నించేందుకు వెళ్లగా తనను బెదిరించారని కూడా ఆయన ఆరోపించారు. దీనిపై స్థానిక పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

ఈ ఆరోపణలపై సోనాలి బింద్రే తరఫు న్యాయవాదులు ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆ భూమిని తాము  నిబంధనలకు అనుగుణంగా, చట్టబద్ధంగా కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. తాము ఎవరి భూమినీ ఆక్రమించలేదని, భూమికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. కేవలం సెలబ్రిటీ అయినందున, డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతోనే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని సోనాలి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదుపై పూణె గ్రామీణ పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి, భూసర్వే నిర్వహించాలని నిర్ణయించారు. సర్వే పూర్తయితేనే భూమి ఆక్రమణకు గురైందా? లేదా? అనే విషయంపై స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు.
Sonali Bendre
Sonali Bendre land dispute
Lonavala
Pune
land grabbing allegations
blackmail attempt
farmer complaint
property dispute
Bollywood actress

More Telugu News