Jabardasth Komurakka: అభిమానులమంటూ ఇంటికి వచ్చి జబర్దస్త్ కొమురక్కపై దాడి

‘జబర్దస్త్’ షోలో కొమురక్కగా సుపరిచితుడైన కుమార్ పై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. అభిమానులమని చెప్పి ఇంట్లోకి ప్రవేశించి, ఆయనపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమురక్క (కుమార్) ఇంట్లో గతంలో చోరీకి గురైన బంగారం విషయంలో తన అసిస్టెంట్ శ్రీనాథ్‌ను నిలదీశారు. చోరీ చేసినట్లు అంగీకరించిన శ్రీనాథ్.. బంగారం తిరిగి ఇస్తానని చెప్పాడు. అయితే, ఆ మాట నిలబెట్టుకోకపోవడంతో రెండు రోజుల క్రితం కుమార్ అతడిని గట్టిగా మందలించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న శ్రీనాథ్, తన స్నేహితులకు చెప్పి అతడిపై దాడికి ప్లాన్ చేశాడు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీనాథ్ తన స్నేహితులు 8 మందితో బైక్‌లపై కొమురక్క ఇంటికి వచ్చారు. తాము అభిమానులమని, ఫొటోలు దిగాలని కోరడంతో ఆయన వారిని లోపలికి అనుమతించారు. లోపలికి వెళ్లగానే, ‘‘మా శ్రీనాథ్‌ను ఎందుకు తిట్టావు?’’ అంటూ వాగ్వాదానికి దిగి దాడి చేశారు. నిందితుల్లో ఒకరు రాయితో దాడి చేయబోగా కొమురక్క సోదరుడు యాదయ్య అడ్డుకున్నారు. దీంతో దుండగులు యాదయ్యతో పాటు అడ్డువచ్చిన స్థానికుడిపైనా దాడికి దిగారు. కర్రతో కొట్టడంతో కొమురక్క కుడి చేతికి తీవ్ర గాయమైంది.

గ్రామస్థులు గుమికూడటంతో నిందితులు తమ బైక్‌ను అక్కడే వదిలి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు బాలానగర్ ఎస్సై లెనిన్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన 8 మందిని బుధవారం అరెస్టు చేశారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
Jabardasth Komurakka
Kumar Jabardasth
Komurakka attack
Balanagar
Srikanth
Mahabubnagar district
Jabardasth show
attack on comedian
Telangana crime news

More Telugu News