Farhat: హనుమకొండలో తీవ్ర విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కూతుళ్ల అనుమానాస్పద మృతి

ఓ తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలు స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషాదకర ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో నిన్న రాత్రి జరిగింది. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే.. పున్నేలు గ్రామానికి చెందిన అజారుద్దీన్, ఫర్హత్ (26) దంపతులు. వీరికి ఉమేరా (8), ఆయేషా (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అజారుద్దీన్ స్థానికంగా ఓ స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులంతా స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లారు. కాసేపటి తర్వాత ఫర్హత్, ఆమె ఇద్దరు కూతుళ్లు పూల్‌లో శవాలై తేలారు.

సమాచారం అందుకున్న ఐనవోలు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఫర్హత్ ఇటీవల మూడోసారి గర్భం దాల్చిందని, ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురు, మనవరాళ్ల మృతిపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మృతురాలి తండ్రి అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
 
Farhat
Hanumakonda
Swimming pool death
Ainavolu
Telangana news
Suspect death
Punnellu village
Family tragedy
Drowning
Police investigation

More Telugu News