Nara Lokesh: ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ ఎంపీలు స్వాగతం

ఢిల్లీకి చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీకు చెందిన ఎంపీలు ఆయనను ఆహ్వానించగా, లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి లోకేశ్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.

నిన్న లోక్ సభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ హర్షం వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్.. ఈ రోజు రాజ్యసభలో చర్చను గ్యాలరీ నుంచి వీక్షించనున్నారు.

ఢిల్లీకి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కె. రామ్మోహన్ నాయుుడు, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బైరెడ్డి శబరి తదితర ఎంపీలు స్వాగతం పలికారు. 


 
Nara Lokesh
AP Minister
TDP MP
Amaravati Bill
Lok Sabha
Rajya Sabha
Penumatsani Chandrasekhar
Kinjarapu Ram Mohan Naidu
Magunta Srinivasulu Reddy
Byreddy Shabari

More Telugu News