Sanjay Mishra: ఓటీటీకి వచ్చేస్తున్న 'వధ్ 2'

సంజయ్ మిశ్రా - నీనా గుప్తా ప్రధానమైన పాత్రలను పోషించిన 'వధ్' సినిమాకి గతంలో మంచి ఆదరణ లభించింది.  2022లో వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాంటి వారి కుతూహలానికి తెరదించుతూ, 'వధ్ 2' థియేటర్లకు వచ్చింది. జస్పాల్ సింగ్ సంధూ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫిబ్రవరి 6వ తేదీన థియేటర్లకు వచ్చింది. 

అలాంటి ఈ సినిమా ఈ నెల 3వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. సంజయ్ మిశ్రా .. నీనా గుప్తా ప్రధానమైన పాత్రలను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో అక్షయ్ డోగ్రా .. అమిత్ కె సింగ్ .. కుముద్ మిశ్రా తదితరులు కనిపించనున్నారు. మొదటి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా సీక్వెల్ ఉందనే టాక్, థియేటర్ల దగ్గర బలంగా వినిపించింది.

శంభునాథ మిశ్రా పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు. అక్కడి జైల్లో మంజు జీవితఖైదుగా ఉంటుంది. ఇటు పోలీస్ ఆఫీసర్ కీ .. అటు ఖైదీకి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వెళుతుంది. అది ఇద్దరి మధ్య బలమైన బంధానికి కారణమవుతుంది. జైల్లోనే వాళ్లు రహస్యంగా కలుస్తుంటారు. రాజకీయనాయకుడు సోదరుడైన కేశవ్ కూడా అదే జైల్లో శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. అతని ద్వారా అక్కడ చోటుచేసుకునే సంఘటనకు ఎలాంటివి? అనేది కథ.

Sanjay Mishra
Vadh 2
Neena Gupta
Vadh sequel
Netflix streaming
Bollywood movies
Hindi thriller movies
Jaspal Singh Sandhu
Indian crime drama
OTT release

More Telugu News